తుల్జా భవాని మాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబం
తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): మహారాష్ట్రలోని తుల్జాపూర్లో కొలువై ఉన్న శ్రీ తుల్జా భవాని మాతను తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం తన సతీమణి, కోకట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిష్టమ్మతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ.. మహిమాన్వితమైన తుల్జా భవాని మాతను దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.