BREAKING
భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

అగ్నికుల క్షత్రియ నేత కొల్లు మూర్తి మృతి బాధాకరం... వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ....

Select Suryaa Now
అగ్నికుల క్షత్రియ నేత కొల్లు  మూర్తి మృతి బాధాకరం...    వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ....


అమలాపురం మేజర్ న్యూస్ :అగ్నికుల క్షత్రియ నేత, మత్స్యకార నాయకుడు కొల్లు సత్యనారాయణ మూర్తి అలియాస్ బాబ్జి మృతి ఎంతో బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ జోన్-2 అధ్యక్షుడు కొల్లు త్రినాధ వర్మ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ,అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో బాబ్జి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
1942లో జన్మించిన కొల్లు సత్యనారాయణ మూర్తి ఓడలరేవు గ్రామంలో రాజకీయంగా, సామాజికంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్థికంగా సంపన్నుడైన ఆయన సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉండటంతో పాటు, రెండు దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సర్పంచ్‌గా, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా పలు పదవులు చేపట్టి తనదైన ముద్ర వేశారు.
ఈ సందర్భంగా కొల్లు త్రినాధ వర్మ మాట్లాడుతూ, రాజకీయాల్లో పదవులు చేపట్టి ఆస్తులు సంపాదించుకునే వారు ఉంటారని, అయితే తనకున్న ఆస్తులను మత్స్యకారుల సంక్షేమం కోసం వినియోగించిన గొప్ప నాయకుడు బాబ్జి అని కొనియాడారు. అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియుల సంఘ భవనం కోసం సుమారు రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని సమకూర్చేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు.
సర్పంచ్‌గా, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అగ్నికుల క్షత్రియులకు అండగా నిలిచిన బాబ్జి మృతి ఆ వర్గానికి తీరని లోటని పలువురు మత్స్యకార నాయకులు పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లాడి ఉమామహేశ్వర వర్మ, మల్లాడి భాను, కోపనాతి ప్రసాద్, ఐనగడ్డ శేషయ్య, వైఎస్సార్‌సీపీ ఓడలరేవు గ్రామ కమిటీ అధ్యక్షుడు త్రిమూర్తులు విశ్వనాథం, పల్లి కామేశ్వరరావు, కొప్పాడి రామకృష్ణ, కోలా బాబులు, కొల్లు వేణుగోపాల్, బొమ్మిడి బాబురావు, కొప్పాడి నాగేశ్వరరావు, మల్లాడి నాగేశ్వరరావు, పెమ్మాడి సాయిబాబు, మాజీ తాలూకా కమిటీ అధ్యక్షుడు సాయి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.