BREAKING
రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెరైన్ కంపెనీ కాలుష్యంతో చేపల మృతి -- పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రామచంద్రమూర్తి

సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట!

Select Suryaa Now
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట!

సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట!

-బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి

 

సిద్దిపేట రూరల్ : సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌, హరీశ్ రావు కృషితో సిద్దిపేట విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగానిలిచిందన్నారు.ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ, పీజీ, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలలు, ఐటీ టవర్లు, గ్రంథాలయం, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కేంద్రం వంటి అభివృద్ధి కార్యక్రమాలు హరీశ్ రావు దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. పదేళ్ల అభివృద్ధిని ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు.
అసంపూర్తి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు?
ప్రజలకు రాజకీయ విమర్శలు కాదని, అభివృద్ధి కావాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 1000 పడకల ఆసుపత్రి, వెటర్నరీ కళాశాల సహా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటి చెరువు పక్కన నిలిచిపోయిన శిల్పారామం పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు. అసత్య ప్రచారాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు పిట్ల రాకేష్‌, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గ్యార మహేష్‌, రూరల్ మండల నాయకులు  శ్రీకాంత్‌, దేశ్‌పాండే విక్రమ్ రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

(సూర్యరూరల్ , రమేష్)