మండల టిడిపి అత్యవసర సమావేశం..
కే.గంగవరం, మేజర్ న్యూస్ :కే.గంగవరంలో మండల టీడీపీ కార్యవర్గ అత్యవసర సమావేశం మండల కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, అల్లూరి సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, ఆత్మ చైర్మన్ వెంటూరి వీరరాఘవలు, రావిపాటి గణేష్ చౌదరి పాల్గొని కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు.
ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వచ్చిందో సభలో ప్రకటించారు. పోటీ చేయాలనుకున్నవారు తమ దరఖాస్తులను మండల కమిటీ ద్వారా అధిష్టానానికి కార్మిక శాఖ మంత్రి ద్వారా పంపుతామన్నారు. కే.గంగవరం జడ్పిటిసి ఎస్సీ జనరల్ కి రిజర్వేషన్ అయినందున టిడిపి తరఫున రవ్వా భూషణం, చిర్రా సురేష్, తరపట్ల ఆనందరావు, కాటే సుబ్రమణ్యం తమ దరఖాస్తును పరిశీలించి మద్దతు ఇవ్వాలని కోరారు.
అభ్యర్థులు బయోడేటాను పార్టీ అధిష్టానానికి పంపుతామన్నారు. ఏ గ్రామ ఎంపీటీసీ పదవి కూటమిలో ఏ పార్టీకి కేటాయించారనేది నియోజవర్గ పెద్దలు, పార్టీ ఇన్చార్జిలు సమావేశమై నిర్ణయిస్తారని నాయకులు పేర్కొన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు పూర్తయ్యాక నవంబర్ 4 నుండి గ్రామాల్లో సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఎంపిక జరిపి ప్రచారం చేపడతామన్నారు.