ఎంపిపి,జడ్పిటిసి రేసులో టిడిపినేతలు వెంగయ్య,మాలకొండయ్య
సిఎస్ పురం,మేజర్ న్యూస్ : రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం తరపున టిడిపి అధిష్టానం ఆశీస్సులు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారంతో మండల టిడిపి సీనియర్ నేతలు డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య మండల పరిషత్ అధ్యక్షుడుగా పోటీచేయడానికి అదేవిధంగా జిల్లాపరిషత్ ప్రాదేశికసభ్యుడుగా సీనియర్ నేత నాగిశెట్టి చినమాలకొండయ్య పోటీచేయడానికి రేసులో ఉన్నారు. డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య,నాగిశెట్టి చినమాలకొండయ్య ఇరువురూ 1987వ సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మండలంలో టిడిపి అభివృద్ధికి విశేషకృషి చేసినవారిలో అత్యంత సీనియర్లుగా మండలంలోని అన్నిగ్రామాలలో ప్రజలకు టిడిపి శ్రేణులకు సుపరిచితులు.అంతేకాకుండా మండల పరిషత్ అధ్యక్షపదవి ఆశిస్తున్న బొమ్మనబోయిన వెంగయ్య మండలంలోని చెర్లోపల్లె గ్రామానికి చెందిన వెనుకబడిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు.వెంగయ్య గతంలో 1994-95 మండల పరిషత్ ఎన్నికల్లో యంపీపీగా టిడిపి అధిష్టానం ప్రకటించగా అప్పుడు మెజారిటీ ఎంపిటిసి స్థానాలు సాధించిన టిడిపి ఎంపిపి పదవికి పోటీచేసిన వెంగయ్య ఒడిపోవడంతో అప్పుడు ఎంపిపి పదవి వేరేవారికి కేటాయించారు.అప్పటి నుండి మండలంలో ప్రతిఒక్కరిని పలకరిస్తూ టిడిపి జెండాను నమ్ముకుని అధిష్టానం ఆదేశాలు పాటిస్తూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతికార్యక్రమంలో పాల్గొని అధిష్టానం పెద్దలవద్ద గుర్తింపు పొందారు.అదేవిధంగా మండల టిడిపి అధ్యక్షుడుగా గత వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పోరాటాలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గెలుపుకు కృషిచేసి మండలంలో మెజార్టీ సాధించడంలో వెంగయ్యను అధిష్టానం గుర్తించి ప్రభుత్వ కనీసవేతనా�