భక్తిశ్రద్ధలతో అన్నదానం.. అమ్మవారిని దర్శించుకున్న భద్రారెడ్డి
ఘట్కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 14):
వెంకటాపూర్లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మండపం వద్ద టీం బోరింగ్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తనయుడు డాక్టర్ చామకూర భద్రారెడ్డి ప్రారంభించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి మండపం వద్ద భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన టీం బోరింగ్ సభ్యులను భద్రారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సామల సందీప్ రెడ్డి, స్వాములు కందుల నవీన్ కుమార్ ముదిరాజ్, అందే అనంతరావు, నీరుడి శ్రీనివాస్, అందే శ్రీకాంత్, చిలుక గణేష్తో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.