విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో కదలిక -లా కళాశాలలను జల్లెడ పెట్టిన ఎస్వీయూ అధికారులు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :ఎస్వీయూ పరిధిలోని పలు ప్రైవేటు లా కళాశాలలో ప్రవేశాల ప్రక్రియలో జరగుతున్న అవకతవకలపై విద్యార్థి సంఘాల ఐక్య వేదిక వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీసీ టాటా నర్సింగరావు విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై స్పందించి లా కళాశాలలను జల్లెడ పట్టారు. వర్సిటీ పరిధిలోని సుమారు ఐదు కళాశాలలను ఆయన ఏకదాటిగా మంగళవారం ఒకే రోజు ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ప్రధానంగా లాసెట్-2026 ప్రవేశాలలో భాగంగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను క్షుణంగా పరిశీలించారు. ప్రవేశాల పొందిన విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలు వసూలు చేస్తున ఫీజు వివరాలపై ఆరా తీశారు. నింబంధనలకు విరుద్ధంగా ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అడ్డగోలుగా అడ్మిషన్లలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అర్హులైన ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా ఫీజు వసూలు చేయాలని సూచించారు.
-వీసీ స్పందన హర్షనీయం
వర్సిటీ పరిధిలోని పలు ప్రైవేటు లా కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేద విద్యార్థుల కడుపుకొడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అడ్డగోలుగా ఫీజు వసూలు చేయడం, కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయకుండా లక్షల రూపాయలకు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అమ్ముకోవడం వంటి విషయాలపై వీసికి ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో హుటా హుటిన వీసీ చొరవ తీసుకుని ప్రైవేటు లా కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పేద విద్యార్థుల పక్షాన నిలవడం హర్షనీయమని తెలిపారు. ఇప్పటికైనా ప్రైవేటు యాజమాన్యం హద్దులు మీరకుండా నిబంధనలకు పాటిస్తూ అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్