telanagana
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి...
సూర్య, వీణవంక:బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని వీడియో తీసినందుకు ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను వీణవంక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... అక్టోబర్ 2వ తేదీ తెల్లవారుజామున నర్సింగాపూర్ ఎస్సీ కాలనీ వద్ద బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఆంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆయన ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. బైక్ తాళం లాక్కొని చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దాడికి పాల్పడిన వల్భాపూర్ గ్రామానికి చెందిన ఊకంటి వేణు (27), ఊకంటి రుత్విక్ (26), నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దాసారపు రామ్ మోహన్ (26), బోయిని అరవింద్ (26)లను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.