అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
-జక్కాపూర్లో ఘటన.. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
సిద్దిపేట రూరల్ : నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. గ్రామానికి చెందిన సూర శ్రావణి (19) ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందడం కలకలం రేపింది.చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జక్కాపూర్ గ్రామానికి చెందిన శ్రావణి సిద్దిపేట పట్టణంలోని శ్రీ మంజునాథ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బుధవారం ఉదయం చేతికి ఇంజక్షన్తో ఇంటికి చేరుకుంది. తల్లి రజిత ఏమైందని అడగగా, ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి పడుకుంది.అనంతరం తల్లి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లిన సమయంలో శ్రావణి ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. తల్లి రజిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.
(సూర్య రూరల్, రమేష్)