మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం :జిల్లా కలెక్టర్ విజయ సునీత
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలి: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత
కనిగిరిలోని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్లో ఏర్పాట్ల పరిశీలన.
రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్.
కనిగిరి ,మేజర్ న్యూస్ :
జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ బుధవారం కనిగిరిలోని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను (ఓట్ల లెక్కింపు హాళ్లు) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ — రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేంద్రంలోనూ భద్రత, వెలుతురు (లైటింగ్), సీసీ కెమెరాల నిఘా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులలో ఎలాంటి లోపం లేకుండా పక్కాగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ మరియు స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి గందరగోళం తలెత్తకుండా మార్గదర్శకాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద త్రీ-టైర్ (మూడు అంచెల) భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.ఈ పరిశీలనలో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.