‘కాంగ్రెస్తో తెలంగాణ అంధకారం’..
హైదరాబాద్, సూర్య ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం తీవ్ర అంధకారంలోకి వెళ్తుందని గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారని, ఇప్పుడు ఆ మాటలు పూర్తిగా నిజమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్ కోతలు సర్వసాధారణంగా మారిపోయాయని, విద్యుత్ సరఫరా సరిగ్గా లేక క్షేత్రస్థాయిలో రైతులు వలవలమని ఏడుస్తున్న పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద తప్పు చేశామని రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా బాధపడుతోందని మండిపడ్డారు. మరోవైపు సింగరేణి సంస్థ నష్టాలబాటలో ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.