కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500...ఆర్జీ-3లో ఐఎన్టీయూసీ పాలాభిషేకం
సూర్య, సెంటినరీ కాలనీ :సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా నుంచి ఈ ఏడాది కూడా ఒక్కొక్కరికి రూ.5,500 ఆర్థిక ప్రయోజనం అందించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ చిత్రపటాలకు ఆర్జీ-3 డివిజన్ పరిధిలో ఐఎన్టీయూసీ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు పాలాభిషేకం చేశారు. ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ-3 డివిజన్ ఇన్చార్జి మబ్బు శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం తో చర్చించి కాంట్రాక్టు కార్మికులకు ఆర్థిక ప్రయోజనం అందేలా కృషి చేసిన నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఉడుత శంకర్ యాదవ్, బండ కిరణ్ రెడ్డి, రీజనల్ జనరల్ సెక్రటరీ శ్రీరాముల కుమార్, సెక్యూరిటీ గార్డులు, నర్సరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.