ఆ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు -24 గంటల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ ఆదేశం -లేనిపక్షంలో గుర్తింపు రద్దు జరిమానా విధిస్తాం : డీఈఓ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి దసరా సెలవుల్లో తరగతులు, పరీక్షలు నిర్వహించిన 4 పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యాశాఖాధికారి కెవిఎన్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించరాదని ఇదివరకే స్పష్టమైన ఆదేశాలుతో పత్రికా ప్రకటన ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిఅక్టోబర్ 13, 14 తేదీల్లో ఈ పాఠశాలల్లో తరగతులు, పరీక్షలు నిర్వహించినట్లు ఫిర్యాదులు వచ్చాయని డీఈఓ తెలిపారు.విద్యార్థి సంఘాల నుండి ఫిర్యాదులతో పాటు ఫొటోలు, వీడియో ఆధారాలు కూడా అందాయని, విద్యార్థులను హాజరుకావాలని ఒత్తిడి చేయడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు, ఫిర్యాదుల, ఆధారాలు మేరకు రైల్వే కోడూరులోని సిల్వర్ బెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తులసి ఇంగ్లీష్ మీడియం స్కూల్, తిరుపతిలోని బైరాగిపట్టెడలోని బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తో పాటు మరో స్కూలుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 24 గంటల్లో ఆ పాఠశాలలు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే, తదుపరి నోటీసు లేకుండానే గుర్తింపు రద్దుకు ప్రతిపాదించడం, జరిమానా విధించడం వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ హెచ్చరించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్