BREAKING
భక్తిశ్రద్ధలతో అన్నదానం.. అమ్మవారిని దర్శించుకున్న భద్రారెడ్డి తిరువీధుల్లో సీతా స్వయంవరం అలంకారం! ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట -టిటిడి ఈఓ ముద్దాడ రవిచంద్ర సేవలు అభినందనీయం : చీర్ల కిరణ్ పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత.. సింగరేణిని దోచుకుంటున్నారు.. కార్మికులను బలిచేస్తున్నారు! విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో కదలిక -లా కళాశాలలను జల్లెడ పెట్టిన ఎస్వీయూ అధికారులు ఎల్‌నినోపై రేపు మంత్రులతో అత్యవసర భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం :జిల్లా కలెక్టర్ విజయ సునీత పాలకొల్లు వార్డుల హద్దులు ప్రజలకు అర్థమయ్యేలా ప్రకటించాలి. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి. ‘కాంగ్రెస్‌తో తెలంగాణ అంధకారం’.. జనసేనలోకి చేరికల జోరు.. ఆ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు -24 గంటల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ ఆదేశం -లేనిపక్షంలో గుర్తింపు రద్దు జరిమానా విధిస్తాం : డీఈఓ నాలుగో టీ 20 లో విండి స్ పరుగుల సునామీ.. మ్యాంచెస్టర్ సిటీ పన్ను వ్యవహారాల విచారణపై వ్యాఖ్యానించలేమన్న బ్రిటన్ పన్ను శాఖ హెచ్‌ఎమ్‌ఆర్‌సి గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

రాత్రి వేళ పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం

Select Suryaa Now
రాత్రి వేళ పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం

వెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు బుధవారం రాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, స్థానిక ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారిపై ఈ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 7 గంటల  సమయంలో  కొనసాగిన ఈ తనిఖీల్లో ప్రధానంగా ద్విచక్ర వాహనాలను ఆపి వారి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్,నంబర్ ప్లేట్లు పరిశీలించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, దొంగతనాలు,చైన్ స్నాచింగ్ వంటి నేరాలను నియంత్రించడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపడుతున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.తనిఖీలలో పోలీసు సిబ్బంది లకావత్ బాల,రాము తదితరులు ఉన్నారు.

రిపోర్టర్, చక్రధర్, వెంకటాపూర్ ,ములుగు జిల్లా