telanagana
చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..!
దుద్యాల, మేజర్ న్యూస్(అక్టోబర్ 14): వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని అల్లిఖాన్‌పల్లి గ్రామంలో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్‌కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు చెట్టు కింద నిలిపి ఉంచగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.రోజువారీ అవసరాల నిమిత్తం వినియోగించే కారును చెట్టు కింద పార్క్ చేసి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కారు దగ్ధం కావడంతో బాధితుడు రమేష్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా, మరేదైనా కారణమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.