బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అడ్లూరి దేవేందర్
• పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా.. అడ్లూరి దేవేందర్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : బీజేపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా లక్షెట్టిపేటకు చెందిన అడ్లూరి దేవేందర్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. బుధవారం తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు , బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్ లకు అడ్లూరి దేవేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా లక్షెట్టిపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎస్సీ మోర్చా బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవేందర్ తెలిపారు.
లక్షెట్టిపేటకు చెందిన అడ్లూరి దేవేందర్కు జిల్లా స్థాయి పదవి లభించడం పట్ల స్థానిక బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కార్యకర్తల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.