BREAKING
వెలివెలలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం సిమెంట్‌ రోడ్లకు రూ.55 లక్షలు.. గ్రావెల్‌ రోడ్లకు రూ.59.5 లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు ♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani మెరుగైన వైద్య సేవలు అందించాలి:జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె. నాగ శ్రీనివాస్ హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త! అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు ♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani సత్యేంద్ర మేధస్సు నన్ను భయపెట్టింది.. నా జీవితంలో అతడే అత్యంత తెలివైన వ్యక్తి: ఆర్జీవీ! దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. దేవరయాంజాల్‌లో అమ్మవారిని దర్శించుకున్న ఈటల సుష్మిత గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రైతులకు బహుళ ప్రయోజనాలు. కనకదుర్గమ్మ సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష, కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రతిష్టమైన చర్యలు మండల పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ టిడిపి నాయకురాలు మేఘాలాదేవి

వేసవికి ముందే విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలి

Select Suryaa Now
వేసవికి ముందే విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలి
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;వచ్చే వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో విద్యుత్‌ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక డిమాండ్‌ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, పాత వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, అవసరమైన విద్యుత్‌ పరికరాలు, సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ కేటాయింపులు, పెండింగ్‌ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేసవి ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ గంగాధర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.