BREAKING
వెలివెలలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం సిమెంట్‌ రోడ్లకు రూ.55 లక్షలు.. గ్రావెల్‌ రోడ్లకు రూ.59.5 లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు ♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani మెరుగైన వైద్య సేవలు అందించాలి:జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె. నాగ శ్రీనివాస్ హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త! అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు ♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani సత్యేంద్ర మేధస్సు నన్ను భయపెట్టింది.. నా జీవితంలో అతడే అత్యంత తెలివైన వ్యక్తి: ఆర్జీవీ! దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. దేవరయాంజాల్‌లో అమ్మవారిని దర్శించుకున్న ఈటల సుష్మిత గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రైతులకు బహుళ ప్రయోజనాలు. కనకదుర్గమ్మ సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష, కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రతిష్టమైన చర్యలు మండల పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ టిడిపి నాయకురాలు మేఘాలాదేవి

ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి

Select Suryaa Now
ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలని, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు జే. అరుణశ్రీ, బి. శ్రీరాములుతో కలిసి వివిధ పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమయానికి విధులకు హాజరుకావాలని, ఉద్యోగుల హాజరును అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి ‘మీ ప్రమాణం’ యాప్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల హాజరును ఈ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.జిల్లా అధికారులు తమ పర్యటనలకు సంబంధించిన టూర్ డైరీలను ప్రతి నెలా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదులు, ఇతర పెండింగ్ ఫైళ్లను నిరంతరం సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ అంశాల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయం, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యాలయ భవనాలు, పరిసరాల పరిశుభ్రతను కాపాడటం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. కార్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిపాలనాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో అందరూ జిల్లా అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.