సూర్య, సెంటినరీ కాలనీ ;సింగరేణి సంస్థలో డిజిఎం బి.వి.సత్యనారాయణ సేవలు మరువలేనివని ఆర్జీ-2 జీఎం తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డిజిఎం బి.వి.సత్యనారాయణ ఒరిస్సాలోని నైనీ ప్రాజెక్ట్ కు బదిలీ పై వెళ్తున్న సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ తాళ్ళపల్లి లక్ష్మీపతి గౌడ్ ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ సత్యనారాయణ ఆర్.జి-2 ఏరియాలో సేఫ్టీ విభాగంలో అందించిన సేవలు మరువలేనివని, కార్మికుల భద్రత విషయంలో ఆయన తీసుకున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. నైనీ ప్రాజెక్ట్ లో కూడా ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న డిజిఎం బి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్జీ-2 ఏరియాలో పనిచేసిన కాలంలో ఏరియా జనరల్ మేనేజర్ తో పాటు అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అందించిన సహాయ సహకారాలను మరువలేనని అన్నారు. సింగరేణి సంస్థ తనకు ఎంతో నేర్పిందని, ఇక్కడ పొందిన అనుభవాలను నైనీ ప్రాజెక్ట్ లో కూడా కొనసాగిస్తానని తెలిపారు. తనకు ఈ సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఒటు జిఎం మాలోత్ రాముడు, ఐఈడీ ఎజిఎం చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ ఎం.వి.ఎన్.చంద్రశేఖర్, డిజిఎం (ఎఫ్ &ఎ) వెంకట్ రాంచంద్ర, పర్చెస్ డిజిఎం వెంకటేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్, క్వాలిటీ మేనేజర్ సుభాష్ , పర్సనల్ హెచ్ ఒడి ఎన్.వేణుగోపాల్,సుభాష్, ఎస్టేట్ ఆఫీసర్ సునీత, ఐటీ మేనేజర్ అశ్విని,మొదలగు కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.