BREAKING
17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు

ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం

Select Suryaa Now
ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర భూభారతి ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌) అసోసియేషన్‌ ప్రతినిధులు  అచ్చంపేట  నియోజకవర్గంలో  పర్యటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను  కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న 636 మంది ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ భద్రత, పెండింగ్‌ వేతనాల చెల్లింపు, విధుల్లో కొనసాగింపు తదితర అంశాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర భూభారతి ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పి. వినయ్ కుమార్  నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్