ఎలక్షన్ కోడ్ కూసింది..చీరాలలో ముమ్మర తనిఖీలు
ఎలక్షన్ కోడ్ కూసింది..చీరాలలో ముమ్మర తనిఖీలు
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం రాత్రి చీరాల పట్టణంలో వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు పలు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఐ అన్నారు. గుంపులుగా చేరడం, రాజకీయ విమర్శలు వ్యాఖ్యలు చేయడం, అల్లర్లు గొడవలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వారిపై కోడ్ ఉల్లంగన చర్యలు తీసుకుంటామని సీఐ సోమశేఖర్ అన్నారు