రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
-రూరల్ మండల అధ్యక్షుడిగా మామిడిపల్లి వెంకటేష్ నియామకం
సిద్దిపేట రూరల్ : రజక సమాజ అభ్యున్నతి, హక్కుల సాధన, అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పనిచేస్తోందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి అన్నారు.ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ మండల కమిటీని బుధవారం ఆయన ప్రకటించారు.మండల అధ్యక్షుడిగా పుల్లూరు గ్రామానికి చెందిన మామిడిపల్లి వెంకటేష్ నునియమించారు.ఉపాధ్యక్షులుగా భూంపల్లి మహేష్, గుండెల్లి స్వామి, ప్రధాన కార్యదర్శులుగా కోడూరి రమేష్, కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుండెల్లి వెంకటేష్తో పాటు పలువురిని వివిధ బాధ్యతల్లో నియమించారు.జిల్లాలో ఇప్పటికే 13 మండల కమిటీల ఏర్పాటు పూర్తయిందని, రజకుల ఐక్యతను బలోపేతం చేస్తూ సమాజ హక్కుల సాధనకు కృషి చేయాలని విజయ్ గణేష్ కోరారు.త్వరలో నిర్వహించనున్న సమితి నాలుగో మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల సత్యస్వామి, జూపల్లి నర్సింలు, శ్రీశైలం, వివిధ గ్రామాల రజక నాయకులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)