మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : మంచిర్యాల పట్టణంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల హరినిలయ విల్లాస్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో బుధవారం సాయంత్రం నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో కత్రె గణేష్, ఆరె రాజేష్, మహమ్మద్ అన్వర్ పాషా, పోలక మల్లేష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,300 నగదు, మూడు సెల్ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.