BREAKING
మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కెనడా కసరత్తు దేవస్థానం నిధులు దుర్వినియోగం సరికాదు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన లుట్స్క్‌పై రష్యా డ్రోన్ దాడి ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యాలో ఏఐ సృష్టించిన నకిలీ ఎలుగుబంట్ల చిత్రాలపై కఠిన చర్యలు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం

సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం

రేపల్లె మేజర్ న్యూస్; సమాచార హక్కు చట్టం–2005పై రైతులకు, ప్రజలకు అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని మండల వ్యవసాయ శాఖ అధికారి అవ్వారు మహేష్ బాబు తెలిపారు. బుధవారం రేపల్లె మండలం చాట్ట్రగడ్డ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మహేష్ బాబు మాట్లాడుతూ
ఈ చట్టంలోని వివిధ సెక్షన్లు, వాటి ప్రాధాన్యత, చట్టాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలను వివరించారు. ప్రతి రైతు, ప్రజలు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే, రాజస్థాన్‌లో సమాచార హక్కు కోసం జరిగిన రైతు ఉద్యమాలు ఈ చట్టం రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించాయని వివరించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా సమాచార హక్కు చట్టం సభ్యులు ఉప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ  సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, చట్టంలోని ముఖ్యమైన అంశాలు, సమాచారాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం, ప్రజలు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి  వెంకటేశ్వరులు, గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)  రామ స్వామి, గ్రామ వ్యవసాయ అధికారి (వీఏఏ ) హిమ బిందు, వివిధ శాఖల సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు
పాల్గొన్నారు.