BREAKING
రాత్రి వేళ పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం శివ సినిమాలో అసలు కథేముంది అని వర్మను అడిగా.. తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు! పంపనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం,కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి బ్రిటన్‌లో ప్రముఖ రచయిత్రి సాలీ రూనీ పుస్తకాల విక్రయాలపై ఆంక్షలు మొబైల్స్ మన జీవితాలను నాశనం చేశాయి.. పాపరాజీల తీరుపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు! ఓటీటీ రాకతో సినిమా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు.. థియేటర్ల నుంచి ఇంటి స్క్రీన్ వరకు ప్రయాణం! రష్యా ఇంధన దిగ్గజం నోవాటెక్ కీలక నిర్ణయం ఈయూ దీర్ఘకాలిక బడ్జెట్‌పై ముదిరిన విభేదాలు ఆసియా ఇన్వెస్టర్లతో వాణిజ్య బంధాలను బలపరచుకోవడమే లక్ష్యంగా ఘనా ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రణాళికలు చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..! ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అడ్లూరి దేవేందర్ కెన్యాలో రెండవ ఎబోలా కేసు నమోదు లండన్ పోలీసుల కాంట్రాక్ట్ వివాదంపై సద్దుమణిగిన లీగల్ వార్

డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే

Select Suryaa Now
డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే

చీపురుపల్లి మేజర్ న్యూస్ : 

రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే  ఆదర్శం కావాలని  శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు అన్నారు.  పట్టణంలోని సంత మార్కెట్ వద్ద బుధవారం ఏర్పాటుచేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన  పాల్గొని మాట్లాడారు.  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, వలిరెడ్డి శ్రీనివాసరావు తో పాటు చీపురుపల్లి, గరివిడి , గుర్ల మండలాల నుండి పలువురు మాజీ  ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,  జడ్పిటిసిలు భారీ స్థాయిలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి చిన్న శ్రీను బాటలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి కళా వెంకటరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్లో రూ.98 వేల కోట్లతో ఏడాదికి ఖర్చు చేసి సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేసిందని, రైతులకు, తల్లులకు ఇచ్చిన హామీలను సైతం శతశాతం నెరవేర్చిందని, అభివృద్ధి సంక్షేమం చూసి తమ పార్టీలో చేరిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రెండువేల 29 లో జరగనున్న ఎన్నికల్లో సైతం చీపురుపల్లి నియోజకవర్గంలో విజయాన్ని సాధించి బహుమతిగా చంద్రబాబునాయుడు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువ నాయకులు నారా లోకేష్  ఇప్పటికే రెడ్ బుక్కుతో ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తించారని వ్యాఖ్యానించారు.  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధిని కాక్షించి, తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఉద్దేశంతో పార్టీలో చేరానని, ఎంత కష్టం వచ్చినా నిత్యం ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా  హామీ ఇచ్చారు. తన బాటలో నడవడానికి తనతో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుల సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు.   చిన్న శ్రీను ఆధ్వర్యంలో పార్టీలో చేరిన  వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ  చిన్న శీను సారధ్యంలో పనిచేసిన తాము అదే తరహాలో చిన్న  పనిచేస్తామని, పదవులు ఆశించి పార్టీలో చేరలేదని, పదవులు లేకపోయినా ప్రజల కోసం చిన్న శ్రీను బాటలో పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, మాజీ విప్పు గద్దె బాబురావు , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, కె త్రిమూర్తుల రాజు, జనసేన నాయకుడు విసనగిరి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు రాజు, టీడీపీ నాయకులు రౌతు కాము నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు, మాజీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ప్రమీల, శ్రీదేవి,  కోట్ల వెంకటరావు,  బుర్లె నరేష్, గరివిడి, గుర్ల, చీపురుపల్లి మండలాల టీడీపీ శ్రేణులు, జనసేన,  బిజెపి నాయకులు పాల్గొన్నారు.