ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విజయవాడ, సూర్య ప్రతినిధి :గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన రాష్ట్రపతికి దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు సమర్పించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో మరియు ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.