BREAKING
మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కెనడా కసరత్తు దేవస్థానం నిధులు దుర్వినియోగం సరికాదు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన లుట్స్క్‌పై రష్యా డ్రోన్ దాడి ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యాలో ఏఐ సృష్టించిన నకిలీ ఎలుగుబంట్ల చిత్రాలపై కఠిన చర్యలు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం

వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు

Select Suryaa Now
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు

పొన్నూరు పట్టణంలో వీధి కుక్కల బెడదపై మున్సిపాలిటీ తక్షణ చర్యలు చేపట్టింది.పట్టణంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని, వాటి వల్ల స్థానిక ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు స్పందించి తక్షణచర్యలుతీసుకోవాలనిఅధికారులనుఆదేశించారు.కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందుకోసం మంగళగిరి నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పించి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కలను సురక్షితంగా పట్టుకున్నారు.మొత్తం 20 వీధి కుక్కలను పట్టుకొని నిబంధనల ప్రకారం శస్త్రచికిత్స మరియు వ్యాక్సిన్లు అందించేందుకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ సెంటర్ కు తరలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, పట్టణంలో వీధి కుక్కల సమస్య తీవ్రతను తగ్గించేందుకు నిరంతరం చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ ప్రజల, ముఖ్యంగా పిల్లల భద్రతే తమకు ముఖ్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్