పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్
తమ నుంచి సేకరించిన రూ.36 కోట్ల నగదు డిపాజిట్లను వెంటనే తిరిగి చెల్లించాలని స్నేహ మ్యాక్స్ బాధిత డిపాజిటర్స్ పరిరక్షణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పొన్నూరు పట్టణంలోని పాత పొన్నూరులో ఉన్న స్నేహ మ్యాక్స్ సంస్థ కార్యాలయం ముందు బుధవారం వారు మీడియాతో మాట్లాడారు.తామంతా విశ్రాంత ఉద్యోగులమని, గత మూడు సంవత్సరాలుగా డిపాజిట్ చేసిన రూ.36 కోట్ల నగదును చెల్లించకుండా స్నేహ మ్యాక్స్ సంస్థ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని బాధితులు వాపోయారు. నగదు గురించి అడిగితే కూడా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ నగదును స్నేహ మ్యాక్స్ యాజమాన్యం నుంచి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్