BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఆమదాలవలస మున్సిపాలిటీకి కొత్త జేసీబీ కొనుగోలు

Select Suryaa Now
ఆమదాలవలస మున్సిపాలిటీకి కొత్త జేసీబీ కొనుగోలు


ఆమదాలవలస,ఆమదాలవలస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరిచేందుకు రూ.41.53 లక్షల నిధులు మంజూరయ్యాయి. వాటితో కొత్త జేసిబిని కొనుగోలు చేసి కమిషనర్ కి గురువారం అందజేశారు.ఆమదాలవలస ఎమ్మెల్యే,  రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కృషి ఫలితంగా ఏపీ జెన్కో ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమం కింద కొత్త జేసీబీ కొనుగోలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు రహదారులపై పేరుకుపోయిన చెత్తకుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఈ జేసీబీ ఎంతగానో ఉపయోగపడనుంది. తద్వారా పట్టణంలో పరిశుభ్రతను పెంపొందించి, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అవకాశం కలగనుంది. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయడం, రహదారులపై వ్యర్థాలను సకాలంలో తొలగించడం, పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ నిధులు ద్వారా కొన్న జెసిబి ను వినియోగించనున్నారు. సీఎస్‌ఆర్ నిధుల ద్వారా జేసీబీ కొనుగోలుకు నిధులు మంజూరు చేసి కొనుగోలు చేయడంతో  మున్సిపాలిటీ పారిశుద్ధ్య సేవలకు మరింత తోడ్పాటు లభించిందని హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా జెన్కో యాజమాన్యానికి ఎమ్మెల్యే,  మున్సిపల్ కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.