BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఇండియా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి!-మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

Select Suryaa Now
ఇండియా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి!-మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

సూర్య స్థానిక డెస్క్ (అంబాజీపేట): మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడాలనే సదుద్దేశంతో సీపీహెచ్ - ఇండియా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. అంబాజీపేటలోని సీపీహెచ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ జె. జార్జ్ పాప్ మార్గదర్శకత్వంలో జోసెఫ్ న్యూ లైఫ్ సెంటర్ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గురువారం సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు.

మండల యూపీఎఫ్ (UPF) అధ్యక్షులు రెవ. డా. జె. విక్టర్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని పొందాలని, కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సీహెచ్. జాన్ మోజెస్, జిల్లా యూపీఎఫ్ ట్రెజరర్ రెవ. ఎస్. ఇమ్మాన్యుయేల్, పాస్టర్ కె. తిమోతి, బెతెస్థా ప్రేయర్ టీం వ్యవస్థాపకులు రత్నం రాజు, పాస్టర్ జోసెఫ్, పాస్టర్ ప్రభు రాజేష్, పాస్టర్ నరసరాజు తదితరులు పాల్గొని శిక్షణ పొందిన మహిళలను అభినందించారు.