ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహ రెడ్డి
52 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహ రెడ్డి ని ప్రకటించడంతో పాటు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 52 వార్డులకు పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా