నూతన భవనానికి కోర్టు తరలింపు
ఆమదాలవలస,ఆమదాలవలస పట్టణములోని చంద్రయ్యపేట సమీపంలో ఉన్న జూనియర్ సివిల్ కోర్టును ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనము లోకి తరలించారు. ఈ కార్యక్రమాన్ని గురువారం జూనియర్ సివిల్ జడ్జ్ బి.రమ్య ప్రారంభించారు. ప్రస్తుత కోర్టు భవనం శిధిలావస్థకు చేరడం న్యాయపరమైన కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత ఏడాది నుండి పాత భవనం శిథిలవ్యవస్థలో ఉండడంతో రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టు,జిల్లా ఉన్నతాధికారుల నివేదిక అందజేయడంతో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో పిఎసిఎస్ నూతన భవనంలోకి మార్చారు. యధావిధిగా కోర్టుకలాపాలు ఈ నూతన భవనంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కనితి విజయలక్ష్మి బాయ్, ఏజీపీ పైడి వరాహ నరసింహులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.