బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక
గజ్వేల్..తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ కాదు, అది మన తెలంగాణ బతుకు. తొమ్మిది రోజుల పాటు తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో బతుకమ్మను పేర్చి, మన ఆడబిడ్డలు ఆడిపాడే తీరులో మన సంస్కృతి, మన ఐక్యత, మన ప్రకృతితో మమేకమయ్యే తత్వం కనిపిస్తుంది.బతుకమ్మ పూలన్నీ ఔషధ గుణాలు కలిగినవి, చెరువుల్లో, అడవుల్లో దొరికేవి. ప్రకృతిని పూజించడం మన తెలంగాణ సంస్కృతి. బతుకమ్మను ఆడపడుచులే తయారు చేసి, ఆడపడుచులే పూజిస్తారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఆటలతో మన ఆకాంక్షను చాటాం. కుల, మత, ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరి బతుకమ్మ ఆడటం మన ఐక్యతకు ప్రతీక.
రైతు సంస్కృతిని, చెరువులను, పూల సాగు చేసే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
అందరికీ మరోసారి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.