BREAKING
అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు! డిజిటల్ వేదికలలో హింసాత్మక మరియు అసభ్య కంటెంట్‌పై మెక్సికో ఉక్కుపాదం ఉదయం పూట యోగా మరియు వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం.. నిపుణుల కీలక సూచనలు! హార్ముజ్ జలసంధిలో సింగపూర్ నౌకలపై క్షిపణి దాడులు...సముద్రంలో మునిగిపోయిన ఒక కంటెయినర్ నౌక రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు గ్లోబల్ రేంజ్‌లో ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్.. సంచలన ప్రణాళికలతో దర్శకుడు నాగ్ అశ్విన్! వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత

కరెంటు కోతలతో పంటలెండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా...

Select Suryaa Now
కరెంటు కోతలతో పంటలెండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా...

 

వేల రూపాయల పెట్టుబడులతో పంటలు సాగుచేసి ఆందోళనలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి…

విద్యుత్ కోతలతో నష్డపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయల పరిహారం అందించాలి…

కరెంట్ కోతలతో ఎండిన పంటలు పరిశీలించిన బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు లక్ష్మీనర్సింహ్మరెడ్డి…

సమయపాలన లేని విద్యుత్ కోతలతో వేల రూపాయల పెట్టుబడులతో సాగుచేసిన వరిపంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచణీయమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మినర్సింహ్మరెడ్డి అన్నారు.వానాకాలం సీజన్లో పచ్చగా కళకళలాడాల్సిన వరి పొలాలు, కరెంటు లేక, సరిపడా నీళ్లు లేక తమ కళ్ళముందే ఎండిపోతుండటంతో అన్నదాతల కుటుంబాలు దిక్కుతోచక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలోని  పలు వ్యవసాయ పొలాలను ఆయన పరిశీలించారు అదేవిధంగా తన వ్యవసాయ పొలంలో తాగు చేసిన వరి పంట సైతం నీరు పారక పూర్తిగా ఎండిపోయిందని దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని విద్యుత్ కోతల కారణమే అని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని, ఎంతో కష్టపడి , వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పంటకు నీరు అందక, మరోవైపు విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో ఎదురవుతున్న ఈ పరిస్థితులు తమను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.వరి పంటలకు కీలకమైన సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి లభ్యత ఎంతో అవసరమని, అలాంటి సమయంలో సరైన సరఫరా లేకపోవడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్టుబడుల భారం, మరోవైపు ఇంకోవైపు విద్యుత్ సమస్యలు, ప్రభుత్వ అసమర్థత తమను కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు లక్ష్మినర్సింహ్మరెడ్డి తెలిపారు. ఎండిపోతున్న పంటలను కాపాడి, అన్నదాతలకు న్యాయం చేయాలని అదేవిధంగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల పంట నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

--------

పి.లక్ష్మణ్, మేజర్ న్యూస్: కడ్తాల్