స్థానిక పోరుకు సిద్ధం కావాలి
• కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశంలో పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రకటించే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పామూరు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని శేషమహల్ ఆవరణలో పట్టణంలోని 2వ ప్రాదేశికానికి సంబంధించి కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పువ్వాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ప్రతి పంచాయతీలో టీడీపీ ప్రకటించే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, బైరెడ్డి జయరామిరెడ్డి, యాదాల వెంకట సాయి కిరణ్, కొండిశెట్టి రమణయ్య, ఉప్పలపాటి హరిబాబు, సయ్యద్ అమీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.