BREAKING
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కొరియాకు బీటీఎస్ చేసినట్లే భారత్‌కు చేయాలన్నదే మా లక్ష్యం.. యువ బాయ్ బ్యాండ్ అవుట్‌స్టేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం సీట్ల సర్దుబాటుపై స్పష్టత భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు ట్రెండింగ్‌లో ‘రాయవలస’ సినిమా మాస్ ఫోక్ సాంగ్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘రింగుడు రింగుడు పిల్లా’! దక్షిణ ఇటలీలో తీవ్రమవుతున్న ఇంధన కొరత ముప్పు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్...సుమారు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనగాని శివప్రసాద్ మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటాతో వడ్డీ రేట్ల పెంపుపై పెరిగిన అంచనాలు బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక

వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం

Select Suryaa Now
వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం

వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక ఎంపీటీసీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు నాయకంటి గిడ్డయ్య మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మండల కేంద్రమైన వెల్దుర్తిలో సుమారు 30 శాతం వరకు ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ, హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్క ఎంపీటీసీ లేదా వార్డు సీటు కూడా ఎస్సీలకు కేటాయించకపోవడం అత్యంత ఘోరమని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అధికారులు ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని విమర్శించారు.

ముఖ్యమైన డిమాండ్లు:

న్యాయమైన రిజర్వేషన్లు పునఃసమీక్షించాలి: వెల్దుర్తి మండలంలోని ఎస్సీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను, వార్డు మెంబర్ సీట్లను తక్షణమే పునఃసమీక్షించి ఎస్సీలకు న్యాయమైన వాటా కేటాయించాలి.తీవ్రస్థాయి ఉద్యమ హెచ్చరిక: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోతే, రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీవ్రస్థాయి ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను హెచ్చరించారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం