BREAKING
అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు! డిజిటల్ వేదికలలో హింసాత్మక మరియు అసభ్య కంటెంట్‌పై మెక్సికో ఉక్కుపాదం ఉదయం పూట యోగా మరియు వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం.. నిపుణుల కీలక సూచనలు! హార్ముజ్ జలసంధిలో సింగపూర్ నౌకలపై క్షిపణి దాడులు...సముద్రంలో మునిగిపోయిన ఒక కంటెయినర్ నౌక రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు గ్లోబల్ రేంజ్‌లో ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్.. సంచలన ప్రణాళికలతో దర్శకుడు నాగ్ అశ్విన్! వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత

భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు

Select Suryaa Now
భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా భట్టిప్రోలు మండలానికి సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం  ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కావడంతో మండల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు ఈ ప్రకటనతో స్పష్టత వచ్చింది. తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చిన స్థానాల్లో పోటీ చేసేందుకు నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.
*ప్రధాన స్థానాల రిజర్వేషన్లు ఇలా...*
మండలంలో అత్యంత కీలకమైన జడ్పీటీసీ స్థానం ఎస్సీకి కేటాయించగా, ఎంపీపీ స్థానం బీసీ (మహిళ)కు కేటాయించారు. దీంతో ఈ రెండు ప్రధాన పదవుల కోసం ఆయా సామాజిక వర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది.
*14 ఎంపీటీసీ స్థానాలకు క్లారిటీ*

మండల పరిధిలోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో జనరల్ స్థానాలు ఎక్కువగా ఉండగా, మహిళలకు పెద్దపీట వేశారు.
*గ్రామాల వారీగా రిజర్వేషన్లు:*
- భట్టిప్రోలు-1 : ఎస్టీ
- భట్టిప్రోలు-2 : ఎస్సీ
- భట్టిప్రోలు-3 : అన్ రిజర్వుడ్ (జనరల్)
- భట్టిప్రోలు-4 : బీసీ
- చింతమోటు : అన్ రిజర్వుడ్ (మహిళ)
- గొరిగపూడి : అన్ రిజర్వుడ్ (మహిళ)
- ఐలవరం : అన్ రిజర్వుడ్ (జనరల్)
- కోనేటిపురం : ఎస్సీ (మహిళ)
- ఓలేరు : అన్ రిజర్వుడ్ (మహిళ)
- పల్లికోన : అన్ రిజర్వుడ్ (జనరల్)
- పెదపులివర్రు : అన్ రిజర్వుడ్ (మహిళ)
- సూరేపల్లి : ఎస్సీ (మహిళ)
- వెల్లటూరు-1 : బీసీ (మహిళ)
- వెల్లటూరు-2 : ఎస్సీ
ఈ రిజర్వేషన్ల ప్రకటనతో భట్టిప్రోలు మండలంలో ఎన్నికల వేడి మొదలైంది. జనరల్ స్థానాల్లో బలమైన నాయకులు, మహిళా రిజర్వుడ్ స్థానాల్లో ఆయా కుటుంబాల నుంచి మహిళా అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఆశావహులు అనుకున్న స్థానాలు రిజర్వేషన్లు మారడంతో కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలియ వచ్చింది.