ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
రేపల్లె మేజర్ న్యూస్; గ్రామాలలో ఎంపిటిసి ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది రాజకీయ పార్టీ సహకారాలతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు తహతహలాడుతున్నారు. గ్రామాలలో తమదైన శైలిలో ఆశవాహులు ఇప్పటినుంచే ప్రతి ఓటర్లు కలిసే పనిలో నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం రిజర్వేషన్లను కేటాయించారు బేతపూడి ఒకటి ఎస్సీకి రిజర్వు కాగా బేతపూడి రెండు అన్ రిజర్వుడు కేటాయించారు. గుడి కాయలంక బీసీ, కామరాజు గడ్డ అన్ రిజర్వ్డ్ మహిళ, చాటగడ్డ ఎస్సీ మహిళ, గంగడి పాలెం బీసీ మహిళ, కారుమూరు అన్ రిజర్వుడు, లంకె వానీిదిబ్బ అన్ రిజర్వుడ్ మహిళ, మోలగుంట బిసి, నల్లూరి పాలెం అన్ రిజర్వుడు మహిళ, పెనుమూడి ఎస్సీ పేటేరు ఒకటి అన్ రిజర్వుడు, పేటేరు రెండు ఎస్సీ మహిళ, పోటు మెరక ఆన్ రిజర్వుడు, తుమ్మల అన్ రిజర్వుడు మహిళ, సోడాయిపాలెం అన్ రిజర్వుడు మహిళా, ఉప్పూడి ఎస్టి సామాజిక వర్గాలకు ఎంపిటిసి స్థానాలను కేటాయించారు. మండల పరిషత్ అధ్యక్షులుగా బీసీ జనరల్ సామాజిక వర్గానికి కేటాయించారు వీటితోపాటు జడ్పిటిసి స్థానాని కూడా బీసీ జనరల్ సామాజిక వర్గానికి కేటాయించారు.