BREAKING
అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు! డిజిటల్ వేదికలలో హింసాత్మక మరియు అసభ్య కంటెంట్‌పై మెక్సికో ఉక్కుపాదం ఉదయం పూట యోగా మరియు వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం.. నిపుణుల కీలక సూచనలు! హార్ముజ్ జలసంధిలో సింగపూర్ నౌకలపై క్షిపణి దాడులు...సముద్రంలో మునిగిపోయిన ఒక కంటెయినర్ నౌక రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు గ్లోబల్ రేంజ్‌లో ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్.. సంచలన ప్రణాళికలతో దర్శకుడు నాగ్ అశ్విన్! వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత

సీట్ల సర్దుబాటుపై స్పష్టత

Select Suryaa Now
సీట్ల సర్దుబాటుపై స్పష్టత

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన నేతల సమన్వయ సమావేశం విజయవంతంగా ముగిసింది. భేటీ అనంతరం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సీఎంతో చర్చలు సజావుగా సాగాయని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సీట్ల పంపకాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

కూటమి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసే పోటీ చేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని బొలిశెట్టి ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి ఏ ప్రాంతంలో ఎక్కువ బలం ఉంటే అక్కడే ఆ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎలాంటి పర్సంటేజీల కోసం తాము చర్చించలేదని, సీట్లు ముఖ్యం కాదని.. కూటమి గెలుపే తమ అంతిమ లక్ష్యమని తేల్చిచెప్పారు.

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరుకున్న విధంగానే గౌరవప్రదమైన రీతిలో సీట్ల సర్దుబాటు జరుగుతోందని ఆయన తెలిపారు. పోటీపై కూటమి పార్టీల మధ్య పూర్తి స్పష్టత ఉందని, ఉమ్మడి వ్యూహంతోనే ముందుకు వెళ్తామని చెప్పారు. త్వరలోనే కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు.