కాత్యాయని అలంకరణలో కనకదుర్గ అమ్మవారు.
సూర్య న్యూస్ అద్దంకి.
కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కనకదుర్గ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు బుధవారం కనకదుర్గ అమ్మవారిని కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం, కుంకుమ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజారి సుబ్రహ్మణ్యం తీర్థప్రసాదాలు అందజేశారు.