BREAKING
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కొరియాకు బీటీఎస్ చేసినట్లే భారత్‌కు చేయాలన్నదే మా లక్ష్యం.. యువ బాయ్ బ్యాండ్ అవుట్‌స్టేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం సీట్ల సర్దుబాటుపై స్పష్టత భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు ట్రెండింగ్‌లో ‘రాయవలస’ సినిమా మాస్ ఫోక్ సాంగ్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘రింగుడు రింగుడు పిల్లా’! దక్షిణ ఇటలీలో తీవ్రమవుతున్న ఇంధన కొరత ముప్పు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్...సుమారు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనగాని శివప్రసాద్ మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటాతో వడ్డీ రేట్ల పెంపుపై పెరిగిన అంచనాలు బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక

బాల్యవివాహాలు సమాజానికి శాపం

Select Suryaa Now
బాల్యవివాహాలు సమాజానికి శాపం

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ బాల్యవివాహాలు సమాజానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని, నిబంధనలు ఉల్లంఘించి వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలతో పాటు జరిమానాలు తప్పవని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ వెల్దుర్తి పరిధిలోని చెరుకులపాడు గ్రామంలో బాల్యవివాహాల నిర్మూలన, ఆరోగ్యం, చట్టాలపై గ్రామ ప్రజలు, కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల తల్లితో పాటు బిడ్డ కూడా తీవ్ర అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువని వివరించారు.

పోషకాహారం తప్పనిసరి:

ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు సమతులాహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఐసీపీఎస్‌ ప్రతినిధులు అత్యవసర సమాయాల్లో వినియోగించుకునే 1098, 181 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ల పనితీరుపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.అనంతరం ఐసీపీఎస్‌ యూనిట్‌ సభ్యురాలు గీత మాట్లాడూతూ.. కిశోర బాలికలు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పద్మావతి, భాస్కర్, ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ నాగరాజు, ఐసీపీఎస్‌ యూనిట్ సభ్యులు గీతావాణి, రామాంజనేయులు, సచివాలయ హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తమ్, ఎంఎస్‌కే రేణుక, అంగన్‌వాడీ టీచర్లు నిర్మలాదేవి, సుమలత, అనంతమ్మ, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు, కిశోర బాలికలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం