నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం
నగరం, మేజర్ న్యూస్:
ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవసరమైన పంచాయతీ కార్యాలయం నగరంలో లేనందున భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో ఏర్పాటు చేసుకోలిగామని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివ ప్రసాద్ చెప్పారు. బుధవారం మండల కేంద్రమైన నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గత కొన్ని దశాబ్దాలుగా మెయిన్ రోడ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉన్న పంచాయతీ భవనాన్ని తొలగించడంతో పాలనా సౌలభ్యం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవన్లో తాత్కారలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. నేడు పంచాయతీ భవన నిర్మాణం ఏర్పాటుతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, పంచాయతీ అభివృద్ధి అధికారి మహమ్మద్ జిక్రియ, మాజీ జడ్పిటిసి సభ్యులు మేక శివరామకృష్ణ, మాన్యం నాగమణి, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, టిడిపి మండల అధ్యక్షుడు చింతల సుబ్బారావు, కూటమి పార్టీల నాయకులు పి.వి. చింతారావు, తాతా ఏడుకొండలు, సమ్మెట శ్రీనివాసరావు, ఉప్పాల చెన్నకేశవులు, వెంకట సుబ్బారావు, కాసాని శ్రీనివాసరావు, ఆళ్ల పూర్ణచంద్రరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.