రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
నగరం, మేజర్ న్యూస్:
చిన్న, సన్నకారు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నందున రైతన్నలకు సక్రమంగా సాగునీరు అందించేందుకు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు సమకూర్చి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివ ప్రసాద్ చెప్పారు. బుధవారం మండల కేంద్రమైన నగరంలో రూ.1.65 లక్షల వ్యయంతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, మాజీ జడ్పిటిసి సభ్యులు మేక శివరామకృష్ణ, మాన్యం నాగమణి, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, టిడిపి మండల అధ్యక్షుడు చింతల సుబ్బారావు, కూటమి పార్టీల నాయకులు పి.వి. చింతారావు, తాతా ఏడుకొండలు, సమ్మెట శ్రీనివాసరావు, ఉప్పాల చెన్నకేశవులు, వెంకట సుబ్బారావు, కాసాని శ్రీనివాసరావు, ఆళ్ల పూర్ణచంద్రరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.