BREAKING
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కొరియాకు బీటీఎస్ చేసినట్లే భారత్‌కు చేయాలన్నదే మా లక్ష్యం.. యువ బాయ్ బ్యాండ్ అవుట్‌స్టేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం సీట్ల సర్దుబాటుపై స్పష్టత భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు ట్రెండింగ్‌లో ‘రాయవలస’ సినిమా మాస్ ఫోక్ సాంగ్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘రింగుడు రింగుడు పిల్లా’! దక్షిణ ఇటలీలో తీవ్రమవుతున్న ఇంధన కొరత ముప్పు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్...సుమారు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనగాని శివప్రసాద్ మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటాతో వడ్డీ రేట్ల పెంపుపై పెరిగిన అంచనాలు బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక

నేత్రదానంతో మానవత్వం చాటిన కుటుంబం

Select Suryaa Now
నేత్రదానంతో మానవత్వం చాటిన కుటుంబం

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: అనారోగ్యంతో మృతి చెందిన బడుగు చినబాబు (56) నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటారు. చినబాబు బుధవారం మృతి చెందగా, విషయం తెలుసుకున్న నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవాసంస్థ నిర్వాహకులు మృతుడి భార్య పద్మ, కుమారులు యశ్వంత్, కార్తీక్‌లతో మాట్లాడి నేత్రదానానికి అంగీకరింపజేశారు. విజయవాడలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వైద్యుడు కుమార్ బందలాయిచెరువుకు చేరుకుని చినబాబు నేత్రాల నుంచి కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానంతో తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు 304వ నేత్రదానం పూర్తయినట్లు సంస్థ ప్రతినిధి రఘుశేఖర్ తెలిపారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా