BREAKING
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘హైందవ’.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్! స్థానిక పోరుకు సీపీఐ సై మంచినీటి సరఫరాకు అంతరాయం దాతల సహకారంతో పార్క్‌ను సుందరీకరించాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌కు ఫిర్యాదు స్థానిక పోరుకు సిద్ధం కావాలి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్

90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్!

Select Suryaa Now
90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్ మరియు లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం స్ట్రీట్ ఫైటర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా అక్టోబర్ 16న తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న ప్రసిద్ధ టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాలీవుడ్ నటులు నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి, జాసన్ మోమోవా, 50 సెంట్, రోమన్ రీన్స్‌తో పాటు భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ మరియు చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.

సినిమా ప్రదర్శన అనంతరం ప్రముఖ సినీ విశ్లేషకులు మరియు ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అద్భుతమైన సన్నివేశాలు, కడుపుబ్బా నవించే హాస్యం మరియు ప్రముఖ వీడియో గేమ్‌ను తలపించేలా తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోందని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాను ఒక క్లియర్ విన్నర్‌గా అభివర్ణించిన విశ్లేషకులు, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమా స్థాయిని పెంచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆండ్రూ కోజి తన పాత్రలో జీవించారని, రోమన్ రీన్స్ అకుమా పాత్రలో చాలా భయపెట్టేలా కనిపించారని ప్రశంసల జల్లు కురిపించారు.

వీడియో గేమ్ ఆధారంగా ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలో ఇది అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని మరో విశ్లేషకుడు కొనియాడారు. గేమ్‌లోని ప్రత్యేకతలను సినిమాలో ఎంతో చక్కగా బ్లెండ్ చేశారని, దర్శకుడు కిటావో సకురాయ్ నటీనటుల నుంచి అద్భుతమైన ప్రదర్శన రాబట్టారని తెలిపారు. కాలినా లియాంగ్ మరియు కోడి రోడ్స్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. 80 మరియు 90ల నాటి క్లాసిక్ యాక్షన్ సినిమాలను గుర్తుచేసే భారీ పోరాట సన్నివేశాలు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లలో ఉపయోగించిన యానిమేషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలిపారు.

ఈ చిత్రంలో కెన్ మాస్టర్స్‌గా నోహ్ సెంటినియో, ర్యూ పాత్రలో ఆండ్రూ కోజి, చున్-లిగా కాలినా లియాంగ్, అలాగే ధాల్సిమ్‌గా మన భారతీయ నటుడు విద్యుత్ జమాల్ నటిస్తుండటం విశేషం. వీరితో పాటు జాసన్ మోమోవా, 50 సెంట్, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, కోడి రోడ్స్, జో అనోవై తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారామౌంట్ పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ విజువల్ యాక్షన్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.