BREAKING
హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం

Select Suryaa Now
కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం

 

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రూ.129.85 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్, శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న విపిన్ జైన్, పొమిల్ జైన్‌లతో పాటు సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాకు చెందిన ఆస్తులపై కూడా ఈడీ కొరడా झుళిపించింది.
టీటీడీకి నాణ్యమైన ఆవు నెయ్యిని అందించాల్సిన డెయిరీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పామాయిల్, రసాయనాలు కలిపి నకిలీ నెయ్యిని సరఫరా చేసి భారీగా లబ్ది పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ లావాదేవీలు, హవాలా మార్గాలు మరియు బోగస్ రికార్డులపై ఈడీ అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.