BREAKING
వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం!

ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహా చండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తున్నారు. కొండ దిగువన ఉన్న మోడల్ ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం (ఐసీసీసీ) నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో వీకే శీనానాయక్‌ తదితరులు ఉత్సవాల నిర్వహణ, భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సజావుగా అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు.