నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
సికింద్రాబాద్ : దసరా నవరాత్రులలో బాగంగా నాల్గవ రోజు శ్రీ చండీ దేవి అలంకారములో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. నిత్య చండీహోమం పూజ నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని వి. అంబూజ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది. హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది.