BREAKING
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం! పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది!

సూర్య ఎఫెక్ట్:...... జల్ పల్లి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు

Select Suryaa Now
సూర్య ఎఫెక్ట్:...... జల్ పల్లి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు

సూర్య ఎఫెక్ట్..... జల్ పల్లి చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు.               జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న పెద్ద చెరువు అపరిశుభ్రతతో ఉండడం వలన బతుకమ్మ ఆడేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆదివారం 'చెరువు వద్ద శుభ్రత ఎక్కడ... ఎంగిలిపూల బతుకమ్మ ఆడేదెట్ల' అనే శీర్షిక సూర్య నేటి దినపత్రికలో ప్రచురితమయింది. ఈ కథనానికి జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్పందించి, ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న చెరువు వద్ద మహిళలు బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. చెరువు సమీపంలో పేరుకుపోయిన చెత్త, వ్యర్ధాలు, పిచ్చి మొక్కలను సిబ్బందితో తొలగింప చేశారు. చెరువు పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్, సున్నం చెల్లించి పరిశుభ్రంగా చేయించారు. మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా లైటింగ్, ప్రత్యేక నిఘాతో రక్షణ ఏర్పాట్లు చేశారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలో ఉన్న మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్ ఆకాంక్షించారు.                           అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.