BREAKING
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం! పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది!

రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Select Suryaa Now
రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

యాలాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): దశాబ్దాలుగా సరైన మరమ్మతులకు నోచుకోని యాలాల మండలం జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవతో రూ.5.71 కోట్ల నిధులు మంజూరు కాగా, బుధవారం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఎనిమిది గ్రామాల రైతులకు సాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

ఎనిమిది గ్రామాలకు సాగునీటి ప్రయోజనం

జుంటుపల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 2,090 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఎడమ, కుడి కాలువల్లో నెలకొన్న సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అగనూరు, మల్రెడ్డిపల్లి, అక్కంపల్లి తదితర గ్రామాల రైతులకు సాగునీరు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ఆధునీకరణ పనులు పూర్తయితే నీటి ప్రవాహం మెరుగుపడి చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి

కాలువల ఆధునీకరణ పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టు అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించలేదని పలువురు నాయకులు అభిప్రాయపడగా, ప్రస్తుతం చేపడుతున్న పనులతో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ.20 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రతిపాదన

జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలనే ప్రతిపాదనను నాయకులు ప్రస్తావించారు. ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే, ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక రంగంలోనూ గుర్తింపు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దారా సింగ్ నాయక్, ఏఎంసీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, జుంటుపల్లి సర్పంచ్ శ్రీవాణి, పీఏసీఎస్ చైర్మన్ అనిల్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం, రావు, జనార్దన్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు శ్రీధర్, ఎంపీడీవో శ్రీనిజ, ఈఈ అశోక్, ఏఈ చందనరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమన్న తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

రిపోర్టర్:ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.